: రైల్వే ట్రాక్ పై ఫొటోలకు ఫోజులు.. ఢీకొట్టిన రైలు
నిర్లక్ష్యంతో వారు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి సమీపంలో కాపలా లేని రైల్వే లైనుపై కారు ఆపి నలుగురు వ్యక్తులు ఫొటోలు దిగుతున్నారు. రైలు వస్తున్న సంగతిని కూడా వారు పట్టించుకోలేదు. ఈ లోపు అటుగా వచ్చిన పల్నాడు ఎక్స్ ప్రెస్ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.