: వెబ్ సైట్ల నిషేధానికి కారణం ఏమిటట?
కేంద్ర ప్రభుత్వం తాజాగా 78 యూఆర్ఎల్ (వెబ్ సైట్ చిరునామాలు)పై నిషేధం విధించింది. గ్వాలియర్ కోర్టు ఆదేశాలను అనుసరించి టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్(ఐఐపీఎమ్) స్వయంగా ఆయా వెబ్ సైట్లపై కోర్టుకు వెళ్లి ఈ ఉత్తర్వులు తెచ్చుకోవడం గమనించాల్సిన విషయం.
73 వెబ్ సైట్లలో ఐఐపీఎమ్ కు వ్యతిరేక సమాచారం ఉందనేది ఆ సంస్థ అభ్యంతరం. వాస్తవానికి ఈ సంస్థకు తగిన గుర్తింపు లేదంటూ యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్ గతేడాది ఒక నోటీసు జారీ చేసింది. దీనిని ఆయా సైట్లు ప్రముఖంగా ప్రస్తావించాయి. దీంతో వీటిపై ఐఐపీఎమ్ కోర్టుకు ఎక్కింది.
దీనిపై ఐఐపీఎమ్ అధిపతి ప్రొఫెసర్ ఆరిందమ్ చౌదరి స్పందిస్తూ, ద్వేష భావంతో సంస్థకు అపఖ్యాతి కలిగించే వెబ్ సైట్లు నిషేధించడం సంతోషంగా ఉందని తెలిపారు. యూజీసీ, ఏఐసీటీఈ విభాగాలు అవినీతి అధికారులతో నిండిపోయాయని ఆయన ఆరోపించారు.
వీరు నిర్ణయించిన విద్యా ప్రమాణాలు సిగ్గుతో కూడినవని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూజీసీ గుర్తింపు లేనందుకు ఐఐపీఎమ్ గర్వంగా భావిస్తోందని చెప్పారు. వాస్తవానికి ఈ నిషేధిత యూఆర్ఎల్ జాబితాలో ప్రముఖ వార్తా సంస్థలవి కూడా ఉండడం సంచలనానికి కారణమవుతోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా, రెడిఫ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, అవుట్ లుక్, ఎకనామిక్ టైమ్స్ వెబ్ సైట్ చిరునామాలు కూడా వీటిలో ఉన్నాయి. అయితే, ఈ నిషేధం వల్ల ఐఐపీఎమ్ కు ఒరిగేదేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఐఐపీఎమ్ కు సంబంధించిన సమాచారం నెట్ ప్రపంచంలో విరివిగా వ్యాప్తి చెంది ఉంటుందని అంటున్నారు.