Superbugs: చికిత్సే లేని సూపర్‌బగ్స్ కారణంగా 4 కోట్ల మంది మరణించే అవకాశం: తాజా అధ్యయనంలో వెల్లడి

4 Crore people would die to superbugs that have no cure

  • ఏఎంఆర్ కారణంగా 1990-2021 మధ్య 10 లక్షల మంది మృతి
  • యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం.. దుర్వినియోగమే కారణం
  • వాటిని ఎదురొడ్డేందుకు బ్యాక్టీరియా, శిలీంద్రాలు చేసే పోరాటం కారణంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ 
  • 2025 నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య  సంరక్షణ ఖర్చు 83 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా

చికిత్స లేని సూపర్‌బగ్స్ బారినపడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్లమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం వుందని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (జీఆర్ఏఎం)లో ఈ విషయం వెల్లడైనట్టు ‘లాన్సెట్’ పేర్కొంది.

1990 నుంచి 2021 మధ్య ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ (ఏఎంఆర్) కారణంగా 10 లక్షల మంది చనిపోయినట్టు తెలిపింది. ఈ సమస్యను తక్షణం పరిష్కరించకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. బ్యాక్టీరియా, శిలీంద్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్‌ను ఎదురొడ్డే క్రమంలో ఇవి ఏఎంఆర్‌గా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాదు, సర్జరీ, క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్‌ను క్లిష్టతరంగా మారుస్తుంది. 

ఇవే పరిణామాలు ఇకపైనా కొనసాగితే 2050 నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 83 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంతేకాదు, ప్రపంచ జీడీపీ 3.8 శాతం కోల్పోతుంది.

మానవులు, జంతువుల్లో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగమే ఈ భయంకర వాస్తవానికి కారణమన్న విషయం అధ్యయనంలో వెలుగుచూసింది. నిజానికి యాంటీమైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వాటిని కూడా ఎదురొడ్డేందుకు బ్యాక్టీరియా, శిలీంద్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ లీడర్ మోహసేన్ నాగవి పేర్కొన్నారు.

Superbugs
AMR
Antibiotics
Health Study
Lancet
  • Loading...

More Telugu News