: ఫ్రెంచ్ ఓపెన్ లో విరిసిన 'నల్ల కలువ'


అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సాయంత్రం పారిస్ లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-4, 6-4తో వరుస సెట్లలో రష్యా భామ, మరియా షరపోవాను చిత్తు చేసింది. ఇక్కడి రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో సెరెనా పవర్ గేమ్ ముందు షరపోవా చేతులెత్తేసింది. కనీసం ఒక్క సెట్ ను కూడా చేజిక్కించుకోలేక అభిమానులను ఉసూరుమనిపించింది. దీంతో ఈ డిఫెండింగ్ చాంపియన్ రన్నరప్ తో సరిపెట్టుకుంది.

సెరెనాకిది కెరీర్లో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా, మొత్తమ్మీద 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక ఈ ఏడాది చాంపియన్ గా అవతరించిన సెరెనాకు రూ.9.4 కోట్లు ప్రైజ్ మనీగా దక్కాయి.

  • Loading...

More Telugu News