: సౌర విద్యుత్ కేంద్రాలకు ప్రభుత్వ రాయితీలు
సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కలిగిస్తూ కోర్ కార్బనెక్స్ సంస్థ ఈ రోజు హైదరాబాదులో ఔత్సాహికుల సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం చట్టాల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకులైన భూమి లభ్యత, బ్యాంకు రుణాలు వంటి సమస్యల పరిష్కారానికి నూతన విధానాన్ని ప్రకటించినట్లు మంత్రి వెల్లడించారు.