: ఇంగ్లాండ్ 269/6
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. పక్కాప్లానింగ్ తో ఆడుతున్న రెండు జట్లు క్రికెట్ అభిమానులకు పసందైన క్రికెట్ విందునందిస్తున్నాయి. ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన ఆసీస్ దాడిని ఇంగ్లాండ్ ఆకట్టుకునే బ్యాటింగ్ తో సమర్ధవంతంగా అడ్డుకుంది. దీంతో బెల్ ఒక్కడే 91 పరుగులు చేయగా అతనికి కుక్(30), ట్రాట్(43) చక్కని సహకారమందించారు. చివర్లో బొపారా(45) అజేయంగా బ్రెస్నన్ (19) తో కలిసి మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 269 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఫల్క్ నర్, మెక్ కే రెండేసి వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ మీద గాయాలతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందన్నదే అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్న.