: ఎమ్మెల్యేలపై వేటు తర్వాత బలాబలాలివే..
ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన అనంతరం అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ కు చెందిన 9 మంది శాసనసభ్యులపై వేటు పడగా ప్రస్తుతం ఆ పార్టీ బలం 146కి పడిపోయింది. ఆరుగురు సభ్యులు అనర్హతకు గురికావడంతో అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య 79కి దిగజారింది. ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ఇలా ఉంది.. వైఎస్సార్సీపీ 17, టీఆర్ఎస్ 17, ఎంఐఎం 7, బీజేపీ 3, ఇతరులు 3 స్థానాలు, లోక్ సత్తా ఒక ఎమ్మెల్యేను కలిగి ఉన్నాయి.