: యుద్ధం చేసేవారికే ఆయుధాన్నివ్వాలి: కేసీఆర్
ఇతరపార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటుండడంపై ప్రత్యర్ధి పార్టీలనుంచి వస్తున్న విమర్శలకు కేసీఆర్ పరోక్షంగా సమాధానం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో కేసీఆర్ మాట్లాడుతూ యుద్దం చేసేవారికే ఆయుధాల్నివ్వాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు సూచించారు. తెలంగాణ వచ్చిన తరువాత వృద్ధులకు, వితంతువులకు వెయ్యిరూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పింఛను ఇవ్వనున్నామని తెలిపారు. గృహనిర్మాణాన్ని 127 గజాల స్థలంలో 2.50 లక్షల వ్యయంతో తామే పూర్తి చేసి అందజేస్తామని ప్రకటించారు. కాగా 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నందునే టీఆర్ఎస్ లో చేరినట్టు కేకే తెలిపారు. మరోవైపు ఇంతవరకూ టీఆర్ఎస్ లో ఆయుధాలు పట్టుకున్నవారే లేరా? అంటూ ప్రత్యర్ధి పార్టీల నుంచి వ్యంగ్యోక్తులు వినబడుతున్నాయి.