: కొత్త మెలిక పెడుతోన్న అద్వానీ!


వచ్చే ఎన్నికలకు గాను బీజేపీ ప్రచార సారథిగా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అగ్రనేత అద్వానీ కొత్తగా మెలిక పెడుతున్నట్టు తెలుస్తోంది. మోడీని ఎన్నికల ప్రచార కమిటీకి 'కన్వీనర్' గా ప్రకటిస్తే తనకేమీ అభ్యంతరం లేదని, అలా కాకుండా ఆయనను 'చైర్మన్' గా నియమిస్తే మాత్రం ఒప్పుకునేదిలేదని భీష్మించుకుని కూచున్నట్టు సమాచారం. ఇదే వ్యవహారంలో అలకబూనిన ఈ అగ్రనేత గోవా సమావేశాలకూ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అద్వానీ కినుక వహించడం వెనుక రాజకీయ ఆంతర్యం ఉందని విశ్లేషకులంటున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో నితీశ్ కుమార్ వంటి నేతలను బుజ్జగించాలంటే మోడీకి ప్రాధాన్యం తగ్గించాలన్నది అద్వానీ అభిప్రాయమని వారు భాష్యం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News