: 'చలో అసెంబ్లీ'కి అనుమతిలేదు: అనురాగ్ శర్మ


తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈ నెల 14న తలపెట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అనుమతించడంలేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. మరో రెండ్రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీపీ నేడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా భద్రత ఏర్పాట్లపై వారు సమీక్షించారు. ఈ భేటీలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ అత్యున్నతస్థాయి సమావేశం అనంతరం అనురాగ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తమనెవరూ 'చలో అసెంబ్లీ' కార్యక్రమం కోసం అనుమతి కోరలేదని వెల్లడించారు. అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని సీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News