: హోం మంత్రి పదవా? నాకా? అబ్బే..!
తాను హోం మంత్రి పదవి ఆశించడం లేదని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు హోం మంత్రి పదవి స్వీకరణ గురించి, 'మీ స్పందనేంటి?' అని అడుగగా, ఇప్పటి వరకూ ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతనూ బాధ్యతాయుతంగా నిర్వర్తించానన్న ఆమె, హోం మంత్రి పదవిని ఆశించడం లేదన్నారు. బంగారుతల్లి పథకం మంచిదని దానికి చట్టబద్దత కల్పిస్తామని తెలిపారు.