: బెట్టింగ్ కేసులో గురునాథ్ సన్నిహితుడికి తాజా సమన్లు
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో మెయ్యప్పన్ గురునాథ్ సన్నిహితుడు విక్రమ్ అగర్వాల్ కు తమిళనాడు క్రైం బ్రాంచ్ సీఐడి తాజాగా సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు వచ్చేవారం తమ ముందు హాజరుకావాలని అందులో పేర్కొంది. అగర్వాల్ కు సమన్లు పంపిన విషయాన్ని సీబీ సీఐడి కూడా ధృవీకరించింది. చెన్నైలో రెండు హోటల్స్ కు యజమాని అయిన అగర్వాల్, బుకీలు తన హోటల్స్ నుంచి బెట్టింగులు నిర్వహించిన వ్యవహారంలో సంబంధం కలిగిఉన్నారంటూ గతవారం ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసులు అగర్వాల్ హోటల్స్ పై దాడి చేశారు. ఇదిలాఉంటే, మరో ఐపీఎల్ కేసులోనూ ఆయన జోక్యం ఉండడంతో ముంబయి క్రైం బ్రాంచ్ మే 31న ఆయనను విచారించింది.