: తండ్రి ప్రాణం తీసిన చిన్నారి ఆట


ఒక్కోసారి చిన్న చిన్న ఘటనలకే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చిన్నారుల సరదాలు ప్రాణాల మీదకు తెస్తాయి. మరికొన్ని సందర్భాలలో మనం కొన్న వస్తువులే మనపాలిట శాపాలుగా పరిణమిస్తాయి. అమెరికాలో ఏది ఆట తుపాకీయో, ఏది నిజం తుపాకీనో తెలీక చేసిన పొరపాటు వారి కుటుంబం పాలిట గ్రహపాటుగా మారింది. అమెరికాలోని ఉత్తర ఆరిజోనా రాష్ట్రంలో ప్రెస్ కాట్ వ్యాలీ హోమ్ లో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల కుమారుడి చేతిలో ఓ 35 ఏళ్ల తండ్రి హతమయ్యాడు. జస్టిన్ స్టాన్ ఫీల్డ్ తన కుమారుడితో ఆడుకుంటూ ఉండగా నాలుగేళ్ల ఆ చిన్నారి తన తండ్రికి తుపాకీ గురిపెట్టాడు. అది నిజం తుపాకీ అని గుర్తించేలోపే పసివాడు దాని ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్టోన్ ఫోర్డ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

  • Loading...

More Telugu News