: ఆరునూరైనా 'చలో అసెంబ్లీ' జరిపితీరుతాం: కోదండరాం


తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదని రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం అన్నారు. ఈ నెల 14న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జేఏసీ రంగారెడ్డి జిల్లాలో బస్సు యాత్రతో ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా కోదండరాం మొయినాబాద్ నుంచి బస్సు యాత్రను ఆరంభించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, చలో అసెంబ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పారు. నిబంధనలకు లోబడే కార్యక్రమానికి అనుమతి కోరామని అన్నారు. కాగా, బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News