: శిల్పాకు కుంద్రా శుభాకాంక్షలు.. క్షమాపణలు


బెట్టింగ్ కేసులో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహయజమాని రాజ్ కుంద్రా తన భార్య, నటి శిల్పాశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో క్షమాపణలు కూడా తెలియజేసుకుని ట్విట్టర్ లో లెంపలేసుకున్నాడు లండన్ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా. ఈ వివాదంతో శిల్పా ఎంతగా బాధపడిందో భర్తగా రాజ్ కుంద్రాకే తెలుసులేండి. తన భార్యకు పుట్టిన రోజు విషెస్ చెప్పిన అమితాబ్ కు కృతజ్ఞతలు చెబుతూ కుంద్రా ట్వీట్ చేశాడు. 'మీ సందేశం ఆమెకు చిరునవ్వునిస్తుంద'ని ఆనందం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News