: కృష్ణా డెల్టాకు నీరివ్వకపోతే బాబు ఆధ్వర్యంలో మహాధర్నా: టీడీపీ ఎమ్మెల్యేలు


వర్షభావ పరిస్థితుల కారణంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందనీ, వెంటనే సాగునీటిని విడుదల చేయకపోతే చంద్రబాబు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

ఈ రోజు ఉదయం గవర్నర్ నరసింహన్ ను కలిసి, కృష్ణా డెల్టాకు నీరందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో దాసరి బాలవర్థన్, దయాకర్ తదితరులున్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ, అధికారులతో చర్చిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని వెల్లడించారు.
       

  • Loading...

More Telugu News