: జమైకన్ చిరుత తడబడింది
వందమీటర్ల పరుగు రారాజు జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ తడబడ్డాడు. తన కెరీర్లో రెండో ఓటమినెదుర్కొన్నాడు. దీంతో రోమ్ డైమండ్ లీగ్ లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత కొంత కాలంగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న బోల్ట్ ను ఒలింపిక్స్ కాంస్యపతక విజేత అమెరికన్ స్టార్ జస్టిన్ గాట్లిన్ 9.94 సెకెన్లలో రేసు ముగించి 0.01 సెకెన్ల తేడాతో బోల్ట్ ను ఓడించాడు. దీంతో ఇప్పటివరకు బోల్ట్ రెండుసార్లు ఓడిపోయాడు. తొలిసారి బ్లేక్ చేతిలో ఓటమి చవిచూడగా, తాజాగా గాట్లిన్ చేతిలో ఓడాడు. ఐతే ఈ ఏడాది మంచి ఊపుమీదున్న గాట్లిన్ రేసు సగంలో బోల్ట్ ను అధిగమించాడు ఇక అప్పట్నుంచి అదే వేగం కొనసాగించి విజేతగా నిలిచాడు.