: సీబీఐ జేడీ బదిలీ బ్రేక్?
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ సస్పెన్స్ ధ్రిల్లర్ ను తలపిస్తోంది. బదిలీ ఉత్తర్వులు ఇంకా అందలేదని విశాఖపట్నంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన ట్రాన్స్ ఫర్ పై క్లారిటీ ఇచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారా? లేదా? అన్న ఆసక్తికర చర్చ రాష్ట్రంలో మొదలైంది. అయితే, మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చినట్లు, ఇప్పటివరకూ ఉత్తర్వులు అందలేదని ఆయన స్పష్టం చేయడంతో జేడీ బదిలీ ఆగి ఉంటుందని, బదిలీని అధికారపక్షం నేతలు ఆపిఉంటారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరో వైపు లక్ష్మీనారాయణ బదిలీని ఆపాలంటూ నిన్న కోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే.