: ఇక్కడా కన్నడ ఫలితాలే: వీహెచ్


2014లో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్ర ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు అన్నారు. భవిష్యత్తులో రాజ్యాధికారం బడుగులదేనని, ఇందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమన్నారు. అవినీతిని సోనియా ఉపేక్షించరనడానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తొలగింపే ఉదాహరణగా పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స్వాగతం పలకడానికి వచ్చిన సందర్భంగా హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News