: రాజీనామా చేసిన మహా ఎన్సీపీ మంత్రులు


మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాజీనామా చేశారు. పార్టీ అధినేత శరద్ పవార్ కు వారి రాజీనామాలను సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, పబ్లిక్ వర్క్స్ మంత్రి ఛగన్ భుజ్ బల్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జయంత్ పాటిల్ ఉన్నారు. ఈనెల 15న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ముందు వారు రాజీనామా చేయడం గమనార్హం. రాబోయే సాధారణ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఎన్సీపీ సీనియర్ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో అధికారం పంచుకున్న ఎన్సీపీ 2014 ఎన్నికల్లో తన బలాన్ని మరింత పెంచుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. 2009 ఎలక్షన్లలో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఎన్సీపీ ఈసారి ఈ సంఖ్యను మరింత రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News