: బాలీవుడ్ లో అడుగుపెడుతున్న యూవీ తండ్రి
టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. మాజీ క్రీడాకారుడు మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మిల్కా పాత్రను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ పోషిస్తున్నాడు. కాగా, మిల్కా కోచ్ పాత్రలో యోగ్ రాజ్ నటిస్తున్నాడు. యూవీ తండ్రి ఇప్పటివరకు పంజాబీలో 35 చిత్రాల్లో నటించాడు. ఆయనకు హిందీలో తొలిచిత్రం ఇదే.