: ఊహించినట్టుగానే సమావేశాలకు అద్వానీ డుమ్మా!
బీజేపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. పనాజీ వేదికగా రెండురోజుల పాటు జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశాల తొలిరోజు అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అనుకున్నట్టుగానే డుమ్మా కొట్టారు. వచ్చే ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలను నరేంద్రమోడీకి అప్పగించాలని పార్టీ నిర్ణయాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్నారనీ, అందుకే ఆయన సమావేశాలకు గైర్హాజరయ్యారని పుకార్లు వినిపిస్తున్నాయి. మోడీ పట్ల కినుక వహించిన అగ్రనేత కావాలనే సమావేశాలకు రాలేదని అంటున్నారు. కాగా, అనారోగ్యం వల్ల తాను రాలేకపోతున్నానని నిన్నటి పదాధికారుల భేటీకి ఆయన వర్తమానం పంపారు.