: గోవా తీరాన కమలం సమావేశాలు షురూ
2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నేటినుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. గోవా రాజధాని పనాజీ తీరాన ఈ ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు, నాయకులు, వందలమంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. రెండురోజుల పాటు జరిగే సమావేశాల్లో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
వచ్చే ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఈ వేదికపైనే అప్పగించనున్నారని స్పష్టమయిన సమాచారం అందుతోంది. ఇదిలావుంటే, అనారోగ్యం కారణంగా నిన్నటి పదాధికారుల భేటీకి పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ గైర్హాజరయిన సంగతి తెలిసిందే. అయితే నేటి సమావేశాలకు మాత్రం ఆయన వస్తున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.