: కాలిఫోర్నియాలో కాల్పులు
అమెరికాలో మరోసారి, మరో అగంతకుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. కాలిఫోర్నియా, సాంటా మోనికాలోని కళాశాలలోకి చొరబడి విద్యార్థులపై తుటాల వర్షం కురిపించాడు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సాంటామోనికా కళాశాలకు చేరుకుని అగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతడు వారిపై కూడా కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు.