: చేప ప్రసాదం రెడీ
ఉబ్బస వ్యాధి నివారిణిగా చెప్పుకునే చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం మృగశిర నక్షత్రం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దీనిని బత్తిన సోదరులు పంపిణీ చేస్తారు. ఇది రేపటి వరకూ కొనసాగుతుంది. చేప ప్రసాద పంపిణీకి ప్రభుత్వం సహకారం అందించవద్దని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడం, దానిపై హైకోర్టు మధ్యంతర స్టే జారీ చేయడంతో చేప ప్రసాదం పంపిణీకి అవాంతరాలు తొలగిపోయాయి.