: 1.5 మిలియన్‌ డాలర్ల నాసా పోటీలకు 11 రోబోలు సిద్ధం


సాంకేతిక పరమైన అభివృద్ధిని మరింతగా ప్రోత్సహించేందుకు గాను... నాసా స్పాన్సర్‌ చేస్తున్న 1.5 మిలియన్‌ డాలర్ల బహుమతి మొత్తం గల పోటీకోసం 11 రోబోలు మసాచుసెట్స్‌లో తలపడుతున్నాయి. వివిధ వస్తువులను స్వతంత్రంగా గుర్తించడంలో ఇవి పోటీ పడాల్సి ఉంటుంది.

రోబోల మధ్య పోటీ నిర్వహించడం కోసం రెండు ఎకరాల విస్తీర్ణంగల సువిశాలమైన మైదానాన్ని సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు వాటి మధ్య ఇక్కడ పోటీలు జరుగుతాయి. అమెరికా, కెనడా, ఈస్టోనియా దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. ఈ పోటీ మైదానాన్ని కొండలు, రాళ్లు, చెట్లతో రకరకాల పరిస్థితుల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. రోబోలు వాటిని స్వతంత్రంగా గుర్తిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మానవ నియంత్రితం కాకుండా.. పనిచేసే రోబోలను అభివృద్ధి చేయడం.. సాంకేతిక విప్లవాన్ని మరింత ముందు తరంలోకి తీసుకువెళ్లడం కోసం.. ఈ పోటీలు పెడుతున్నట్లు నాసా అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News