: మనదేశాన్ని మింగేస్తోన్న 'తీయని' శత్రువు!
మనదేశంలో మధుమేహం అనేది ఓ పెద్ద మహమ్మారిలాగా విజృంభిస్తోంది. అత్యధిక మరణాలకు ఇదే కారణం అంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. 2030 నాటికి దేశంలో అత్యధికంగా పది కోట్ల మంది చక్కెర వ్యాధి బాధితులు ఉంటారని నాన్ కమ్యూనికల్ డిసీజెస్ కు సంబంధించి విడుదలైన నివేదిక చెబుతోంది.
అత్యంత ప్రమాదకరమైన మరో వాస్తవం ఏంటంటే.. దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2011 గణాంకాలతో పోలిస్తే.. ఇప్పటికి 12 శాతం పెరిగిందట. గత ఏడాది ఈ వ్యాధితో మరణించిన వారే సుమారు పది లక్షల వరకు ఉన్నారు. మొత్తం వ్యాధి గ్రస్తుల సంఖ్య 6 కోట్ల వద్ద ఉంది. ప్రజల సామూహిక ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోకుండాపోయినట్లయితే.. 2030 నాటికి పదికోట్ల మంది రోగగ్రస్తులు ఉంటారంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.