: శత్రుమూకల ఆట కట్టే పిట్ట రోబో


ఎగిరే పక్షి రూపంలో ఉండే రోబోను అమెరికన్‌ సైన్యం తయారుచేసింది. ప్రత్యేకించి యుద్ధ అవసరాల కోసం దీనిని నిర్మించారు. యుద్ధాల సమయంలో శత్రువుల ప్రాంతాల మీదికి ఎగురుతూ వెళ్లి వారి ఆనుపానులు పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడుతుంది. ఈ రోబో ఎంత సహజంగా రూపొందింది అంటే.. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసినప్పుడు.. తమ సామ్రాజ్యంలోకి కొత్త పక్షి ఏదో వచ్చేసిందని.. గద్దలు దానిపై దాడికి దిగాయట!

అమెరికాలోని సైనిక పరిశోధనశాల వారితో మేరిల్యాండ్‌ యూనివర్సిటీ వారు జతకలిసి దీనిని అభివృద్ధి చేశారు. పైకి అచ్చం నిజమైన పక్షిలాగా కనిపించడానికి.. త్రీడీ ప్రింటెడ్‌ ఉష్ణనిరోధక ప్లాస్టిక్‌, కార్బన్‌ ఫైబర్‌, ఫోం లతో తయారుచేశారు.

ఈ పిట్టరోబో రూపకల్పనలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కృషి కూడా ఉంది. మేరీల్యాండ్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.కె.గుప్తా, హూగ్‌ బ్రూక్‌ అనేక పరిశోధనలు చేసి దీన్ని రూపొందించారు. జాన్‌గెర్జాస్‌ దాన్ని మరింత అభివృద్ధి చేశారు. మొత్తానికి రోబో రావెన్‌ పేరుగల పిట్ట రోబో తయారైంది.

  • Loading...

More Telugu News