: ఫిక్సింగ్ పై 'స్పెషల్' ఎపిసోడ్
సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బుల్లితెరకెక్కనుంది. ఈ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని ఓ స్పెషల్ ఎపిసోడ్ కలర్స్ చానల్ లో ప్రసారం కానుంది. 'సైతాన్-ఏ క్రిమినల్ మైండ్' అనే క్రైమ్ సీరియల్ లో భాగంగా ఫిక్సింగ్ పై ఎపిసోడ్ ను నిర్మిస్తారు. ఈ ఎపిసోడ్ లో ఫిక్సింగ్ నేపథ్యంలో బ్లాక్ మెయిలింగ్, కిడ్నాపింగ్, హత్య వంటి అంశాలు ఉంటాయని సీరియల్ నిర్మాణ సంస్థ 'మిడిటెక్' తెలిపింది.
ఇక, ఈ ఎపిసోడ్ కథాంశం ఏమిటంటే.. ఇద్దరు బాలురు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. వారిలో ఒకరు క్రికెట్ పై పెద్ద ఎత్తున బెట్టింగ్ కు పాల్పడి నష్టపోతాడు. పరిస్థితుల ప్రభావంతో బుకీ మేనల్లుడిని కిడ్నాప్ చేస్తాడు. కానీ, పోలీసులకు దొరక్కూడదన్న ఉద్దేశంతో బుకీ మేనల్లుడిని హత్య చేస్తాడు. ఈ కథాంశం ఉత్కంఠభరితంగా ఉంటుందని, వీక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని 'మిడిటెక్' సీఈఓ నిఖిల్ ఆల్వా చెప్పారు.