: గుంటూరులో రేపు కరెంటు కట్
గుంటూరు పట్టణంలో రేపు విద్యుత్ కు భారీ అంతరాయం కలగనుంది. 13 గంటలపాటు పట్టణంలో విద్యుత్ నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వారు తెలిపారు. గుజ్జనగుండ్లలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండడంతో ఈ అంతరాయం తప్పడంలేదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.