: ఇక నెలలో రెండుసార్లు క్యాబినెట్ భేటీ
నేడు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీలో సీఎం కిరణ్ మాట్లాడుతూ, ఇకనుంచి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. నెలలో రెండు శుక్రవారాల్లో ఈ భేటీలు ఉంటాయని వెల్లడించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టెక్కించే బాధ్యతను ఇన్ ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంచాయతీ ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో పార్టీ అగ్రనేతలను సమన్వయ పర్చుకుంటూ ముందుకు సాగాలని కిరణ్ సూచించారు.