: జానారెడ్డి తో పొన్నాల జగడం


దాదాపు మూణ్ణెళ్ళ అనంతరం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. కాగా, ఈ భేటీలో మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వాగ్వాదానికి దిగారు. జలయజ్ఞం భారంగా మారిందని, ఆ పథకం వల్ల ఒరిగేదేమీ లేదని జానారెడ్డి వ్యాఖ్యానించగా.. పొన్నాల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జానా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కాసేపు వాడీవేడీ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం.

ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బంగారుతల్లి పథకంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, ఎస్సీఎస్టీ కమిషన్ ను రెండుగా విభజించడం, రాజీవ్ స్వగృహ ఇళ్ళను రెండు దశల్లో లబ్దిదారులకు అందించడం వంటి వాటికి ఆమోదముద్ర వేశారు.

  • Loading...

More Telugu News