: 'జేబులు ఖాళీ' అంటోన్న కింగ్ ఫిషర్ అధినేత


తీవ్ర ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేతులెత్తేస్తున్నట్టే కనిపిస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిధుల్లేక మూలనబడిన నేపథ్యంలో సంస్థ ఉద్యోగులు జీతాల్లేక అలమటిస్తున్నారు. వారికి నెలలకొద్దీ బకాయిలు అందాల్సి ఉంది. గత కొద్దిరోజుల నుంచి కింగ్ ఫిషర్ ఉద్యోగులు ముంబయిలోని సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఎట్టకేలకు స్పందించిన మాల్యా.. బకాయిలు చెల్లించేందుకు తన వద్ద చిల్లిగవ్వలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.

యునైటెడ్ స్పిరిట్స్ బ్రూవరీస్ లో బ్రిటీష్ లిక్కర్ జెయింట్ డయాజియోకు వాటాలు విక్రయించి అప్పుడు జీతాలు ఇస్తానని తెలిపాడు. యునైటెడ్ స్పిరిట్స్ లో 53.4 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 11,166 కోట్లు వస్తాయని మాల్యా ఆశిస్తున్నాడు. అయితే, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చకుండా కర్ణాటక హైకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసిందని, ఆ వ్యవహారం ఓ కొలిక్కి వస్తేనే బకాయిల చెల్లింపు ఉంటుందని మాల్యా తన ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News