: ఢిల్లీలో కొనసాగుతున్న రాహుల్ సమాలోచనలు
పార్టీ నేతలతో రాహుల్ గాంధీ కీలక సమాలోచనలు ఢిల్లీలో నేడు కూడా కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్ నిన్న ఢిల్లీలో భేటీ అయ్యి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ నేడు కూడా వారితో సమావేశం అయ్యారు.
దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ కూడా పాల్గొంటున్నారు. నేటితో సమావేశం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ నుంచి ఈ రోజు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.