: కేసీఆర్, విజయశాంతిలపై హైకోర్టులో పిల్


టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు, ఎంపి విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్ రావుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐకి రఘునందన్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టులో పిల్ వేసిన న్యాయవాది తెలిపారు. సీబీఐ జేడీ, కేసీఆర్, విజయశాంతి, హరీష్ రావు, రఘునందన్ లను అందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్త నుంచి కేసీఆర్ రూ.10 కోట్లు, విజయశాంతి ఇంట్లో రూ.80 లక్షల లావాదేవీల్లో హరీష్ రావు పాత్రపై సీబీఐకి రఘునందన్ వివరంగా చెప్పినా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News