: మరో 'డర్టీ పిక్చర్'కు సిద్ధమంటున్న విద్య


నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం 'డర్టీ పిక్చర్'. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన విద్యా బాలన్ నటన ఎప్పటికీ గుర్తుంటుంది. అందుకే ఉత్తమ జాతీయ నటి అవార్డుతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. తన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పిన ఈ చిత్రంపై అమితమయిన ఇష్టాన్ని పెంచుకున్న విద్య, మరో 'డర్టీ పిక్చర్' చేసేందుకు సిద్ధమంటోంది. తాజాగా నటించిన 'ఘన్ చక్కర్'లో పాత్ర కూడా ధైర్యంతో కూడినదేనని వివరిస్తోంది. అందుకే తాను మరోసారి అలాంటి చిత్రాన్న చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News