: సైనా పోరాటం క్వార్టర్ ఫైనల్ తో సరి


భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పోరాటం ముగించింది. బ్యాంకాక్ లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-13, 12-21, 18-21తో సింగపూర్ అమ్మాయి జువాన్ గూ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్ నెగ్గి మాంచి ఊపుమీదున్నట్టు కనిపించిన ఈ హైదరాబాదీ తార, ఆ తర్వాత జోరు కొనసాగించడంలో విఫలమైంది.

  • Loading...

More Telugu News