IT Act: నగలు అమ్మి ఇల్లు కొంటే పన్ను కట్టక్కర్లేదా.. ఐటీ చట్టం ఏం చెబుతోందంటే..!

  • వారసత్వంగా వచ్చిన నగల అమ్మకంపై లాభాలు దీర్ఘకాల మూలధన లాభాలే..
  • వాటికి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందేనన్న అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంగళూరు బెంచ్
  • ఐటీ చట్టంలోని సెక్షన్ 54 ఎఫ్ ను ఉదహరిస్తూ తీర్పు
What is Section 54 f of income Tax Act

పూర్వీకుల నుంచి వారసత్వంగా అందుకున్న బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన లాభాలు దీర్ఘకాల మూలధన లాభాలేనని ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈమేరకు ఓ కేసులో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 ఎఫ్ ను ఉదహరిస్తూ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంగళూరు బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కోరుతూ ఓ వ్యక్తి క్లెయిమ్ దాఖలు చేసుకోగా ఐటీ సమీక్షాధికారి తిరస్కరించారు. దీంతో బాధితుడు అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాడు. దీనిపై బెంగళూరు బెంచ్ విచారణ జరిపింది. వారసత్వంగా అందుకున్న నగలను అమ్మి ఇంటిని కొనుగోలు చేస్తే.. ఆ నగల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తానికి దీర్ఘకాల మూలధన లాభాల కింద పన్ను మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

సెక్షన్‌ 54 ఎఫ్‌..
ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 54 ఎఫ్ ప్రకారం దీర్ఘకాల మూలధన ఆస్తులు (షేర్లు, బాండ్లు, ఆభరణాలు, బంగారం) అమ్మగా వచ్చిన ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అయితే, వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకు వినియోగించనపుడు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అదేవిధంగా పూర్వీకుల నుంచి ఇంటిని వారసత్వంగా పొందితే దానిని దీర్ఘకాల మూలధన ఆస్తిగా పరిగణించరు.

మినహాయింపు ఎవరికంటే..
వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు సెక్షన్ 54 ఎఫ్ కింద ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మినహాయింపు వర్తించాలంటే.. దీర్ఘకాల ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇల్లు కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడి పేరిట అప్పటికే మరొక ఇల్లు ఉంటే ఈ మినహాయింపు వర్తించదు. 

ఇల్లు కొనగా మిగిలిన మొత్తంపై పన్ను..
వారసత్వ నగలను అమ్మగా వచ్చిన మొత్తం, ఇంటి కొనుగోలుకు వెచ్చించిన మొత్తం సమానమైతే పన్ను ఉండదు.. 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వారసత్వంగా అందుకున్న బంగారాన్ని అమ్మితే వచ్చిన మొత్తం రూ.10 కోట్లు దాటినా, ఇంటి కొనుగోలుకు అయిన మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నా.. ఆ మిగిలిన మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌..
బంగారం అమ్మిన వెంటనే కొనేందుకు నచ్చిన ఇల్లు దొరకకపోవడం, ఈలోగా ఐటీఆర్‌ గడువు సమీపించడం జరిగితే.. బంగారం అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. ఇలాంటి సందర్బాల్లో పన్ను మినహాయింపునకు వీలు కల్పించేదే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌. పూర్వీకుల బంగారం అమ్మగా వచ్చిన సొమ్మును తాత్కాలికంగా ఈ ఖాతాలో డిపాజిట్ చేస్తే ఆ ఏడాదికి పన్ను మినహాయింపు పొందవచ్చు. తర్వాతి ఏడాది ఐటీఆర్ గడువు సమీపించేలోగా ఇంటిని కొనుగోలు చేయొచ్చు.

  • Loading...

More Telugu News