: ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు తిరస్కరణ
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ టెలికామ్ మంత్రి దయానిధి మారన్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, ఏమాత్రం విలువ లేని పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు జరిమానా అవిదిస్తూ, ఏడు రోజుల్లోగా రూ.20వేలు కోర్టు ఖాతాలో డిపాజిట్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సమాచార హక్కు కార్యకర్త వివేక్ గార్గ్ ను ఆదేశించింది. చౌకబారు ప్రచారంకోసం ఎలాంటి ఉపయోగంలేని పిటిషన్ ను వేశారని, దీనివల్ల కోర్టు సమాయాన్ని వృధా చేశారని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ షైనీ మండిపడ్డారు.