: కోడలిపై మామ హ(అ)త్యాచార యత్నం!


మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు చేసినా, శిక్షలు విధించినా రోజురోజుకూ మృగాళ్ల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. అయిన వారే ఆడవార్ని కాటేస్తుంటే వావివరసలు లేకుండా కోరికలు తీర్చమంటూ వేధింపులకు దిగుతుంటే, కడుపున పెట్టుకుని రక్షించాల్సినవారే 'కంచె చేను మేసిన చందాన' కాటేస్తుంటే మహిళ తల్లడిల్లిపోతోంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి మండలం కట్టెవరంలో కామాంధుడైన ఓ మామ కోరిక తీర్చ లేదని కోడలిపై గడ్డపారతో దాడి చేసాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మామ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా చాలాసార్లు ఈ అతను ఇలాంటి వేధింపులకు పాల్పడ్డాడని బంధువులు, చుట్టుప్రక్కల వారు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News