: 78 వెబ్ సైట్లపై టెలికాం శాఖ నిషేధం


మరోసారి టెలికాం శాఖ వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించింది. వివాదాస్పద సమాచారంతో ఉన్న 78 యూఆర్ఎల్ చిరునామాలపై నిషేధం విధించింది. వీటిని వినియోగదారులు వీక్షించకుండా నిషేధాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్నెట్ సేవల సంస్థల (ఐఎస్పీ)ను టెలికాం శాఖ ఆదేశించింది. వీటిలొ 73 వెబ్ సైట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ (ఐఐపీఎమ్), దాని డైరెక్టర్ ఆరిందమ్ చౌదరి గురించి వివాదాస్పద సమాచారాన్ని కలిగి ఉన్నాయి.

అలాగే 'చట్టం ప్రకారం ఐఐపీఎమ్ అనేది ఒక యూనివర్సిటీ కాదు' అంటూ
గత ఏడాది జూలైలో యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసిన నోటీసు కూడా ఈ వెబ్ సైట్లలో పోస్ట్ చేసి ఉంది. గ్వాలియర్ కోర్టు ఆదేశాలతో టెలికాం శాఖ ఈ సైట్లపై వేటు వేసింది. 

  • Loading...

More Telugu News