: పాక్ ను బెంబేలెత్తిస్తున్న కీమర్ రోచ్
ఇంగ్లాండ్ లోని ఓవల్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ లీగ్ మ్యాచ్ లో పాక్ తడబడుతోంది. కీమర్ రోచ్ నిప్పులు చెరిగే బంతులకు తొలి మూడు వికెట్లను త్వరగానే కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు రెండు పరుగులకే షాకిచ్చాడు రోచ్ తొలి ఓవర్లోనే ఇమ్రాన్ ఫర్హాత్ ను ఔట్ చేసాడు. తరువాత వచ్చిన మహమ్ముద్ హఫీజ్ ను నిప్పులు చెరిగే బంతితో బౌల్డ్ చేసాడు రోచ్, అనంతరం అసద్ షఫీక్ ను కూడా అవుట్ చేసి పాకిస్ధాన్ ని కోలుకోలేని దెబ్బతీసాడు. దీంతో పాక్ జట్టు 9 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.