: చిత్తూరు జిల్లా మార్కెట్ యార్డులకు సీఎం తండ్రి పేరు


చిత్తూరు జిల్లాలో పెద్దగా ఉపయోగంలో లేని రెండు మార్కెట్ యార్డులకు సీఎం కిరణ్ తండ్రి పేరు పెట్టారు. కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలేరు నియోజకవర్గంలో చింతపర్తి, కలకడ వద్ద ఈ రెండు మార్కెట్లు ఉన్నాయి. వీటిలో లావాదేవీలు చాలా తక్కువగా జరుగుతాయని తెలుస్తోంది. అయితే, కిరణ్ ముఖ్యమంత్రి అవగానే వీటికి మహర్దశ పట్టింది. నిధులు వెల్లువలా వచ్చిపడ్డాయి. కానీ, ఇక్కడ క్రయవిక్రయాలు తక్కువే అయినా, సీఎం తండ్రి అమరనాథ్ రెడ్డి పేరు పెట్టి మార్కెట్ వర్గాలు తరించగా, దానికి అధికారికంగా ఆమోదముద్రవేసి మార్కెటింగ్ శాఖ విధేయత చాటుకుంది.

  • Loading...

More Telugu News