: పాఠ్యాంశంగా 'హైదరాబాద్ పేలుళ్ళు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ ఘటన పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకుంది. ఈ సంవత్సరం నుంచి రాష్ట్రంలో 8,9 తరగతులకు నూతన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. కాగా, తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో ఈ పేలుళ్ళను పాఠ్యాంశంగా చేర్చారు. ఆ పాఠంలో హైదరాబాద్ పేలుళ్ళతోపాటు ముంబయి తాజ్ హోటల్ వద్ద ఉగ్రదాడుల గురించి చిత్రాలతో సహా ముద్రించారు. దాడుల సమయంలో ఏం చేయాలనే విషయమై విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఆ అభ్యాసంలో పలు సూచనలు చేశారు. అంతేగాకుండా, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్ సాన్ సూకీ జీవితాన్ని కూడా చిన్నారులకు పరిచయం చేయనున్నారు.