: అధిష్ఠానం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుంది: రాజనర్సింహ
రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉపముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ భేటీలు, చర్చలతో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న పార్టీ ఆధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ తోను భేటీ అయిన ఉపముఖ్యమంత్రి, పార్టీ అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చిస్తోందని, తెలంగాణ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ రోజు కూడా రాజనర్సింహ పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు.