: అనారోగ్యంతో వున్నందున అద్వానీని రావద్దని నేనే చెప్పాను: రాజ్ నాథ్ సింగ్
అనారోగ్యం కారణంగా గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు బీజేపీ అగ్రనేత అద్వానీ సమాచారం అందించిన సంగతి తెలిసిందే. దాంతో పార్టీలో అంతర్గత విభేదాలున్నట్లు వస్తున్న ఊహాగానాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. అద్వానీ ఆరోగ్యం సరిగాలేనందున సమావేశానికి హాజరుకావద్దని తానే చెప్పినట్లు గోవాలో తెలిపారు. అయితే శనివారం ఆయన వస్తారని చెప్పారు.