: తండ్రి పుట్టినరోజు వేడుక చేసుకోలేకపోయిన సంజయ్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు తండ్రి సునీల్ దత్ అంటే ఎంతో ప్రేమ. ఏటా తండ్రి జయంతి రోజున కేక్ కట్ చేయడం, స్వీట్లు పంచిపెట్టడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. సునీల్ దత్ బతికున్నప్పుడు కూడా వేడుక చేసుకునే వారు. కానీ, ఈ ఏడాది తండ్రి జయంతి (జూన్ 6)నాడు కేక్ కోసి, సహచర ఖైదీలకు స్వీట్లు పంచిపెట్టడానికి పుణెలోని ఎరవాడ జైలు అధికారులు సంజయ్ ను అనుమతించలేదు. అదేమంటే భద్రతా కారణాలను చూపించారు. చేసేదేమీ లేక గురువారం ఉదయాన్నే లేచి తండ్రికి తన జైలు గదిలోనే సంజయ్ దత్ నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News