: ఎన్నిచట్టాలు తెచ్చినా వేధింపులు ఆగడం లేదు: పురంధేశ్వరి


మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాదులోని సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన కోవే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి పురంధేశ్వరి మాట్లాడుతూ, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస నిరోధానికి ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేటికీ వేధింపులు తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. మహిళలకు పూర్తి స్థాయిలో ఆర్ధిక స్వేచ్ఛ లభించిననాడే వివక్ష తొలగిపోయే అవకాశముంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News