: ఏడుకొండలలో భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాుగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు భక్త జనం బారులు తీరి ఉన్నారు. 21 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో వెళ్లేవారికి 5 గంటలు తీసుకుంటోంది. కాలినడకన వచ్చేవారికి నాలుగు గంటలలోనే దర్శనం పూర్తవుతోంది. నిన్న వసంత పంచమి, అంతకు ముందు రెండు రోజుల పాటు కల్యాణ ముహూర్తాలు ఉండడంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది.