: వివాహ బంధానికి ముగింపు పలికిన రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన సతీ మణి ల్యుడ్ మిలా 30 సంవత్సరాల తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. తాము విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఇద్దరి మధ్య విభేదాలున్నాయా ? అని ఓ టెలివిజన్ ఛానల్ కార్యక్రమంలో అగిడిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానమిచ్చారు. తమ విషయంలో సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలు, పుకార్లు నిజమేనని రష్యన్ పౌరులకు తెలిపారు. అయితే, ఇది తమ ఉమ్మడి నిర్ణయమని పుతిన్ చెప్పారు. ఈ సమయంలో ల్యుడ్ మిలా కూడా పక్కనే ఉన్నారు. 1983 లో వివాహం చేసుకున్న వీరిద్ధరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. త్వరలో తాము విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పారు.